జనసేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

రాజాం, మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఉర్లాపు పోలరాజు(యు.పి.రాజు) ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు మహాత్మ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజాం మండలం బుచ్చింపేట గ్రామంలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆ గ్రామ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు గొర్లె గోవిందరావు మాట్లాడుతూ యువత అంతా గాంధీ మార్గంలో నడవాలని సూచించారు. రాజాం మండల నాయకులు సామంతుల రమేష్ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం జనసేన పార్టీతోనే సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నమ్మి దుర్గారావు, ఎన్ని సత్యం, హరిబాబు, ఈశ్వర్, ఉర్లాపు ఆదినారాయణ, దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.