జనసేన ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

  • జనసేన పార్టీ బోనకల్ మండల కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

మధిర, స్థానిక బోనకల్లు రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలు అర్పించిన జనసేన పార్టీ మండల కమిటీ. అక్టోబర్ రెండవ తేదీ ఆదివారం రోజున మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో ఓ సామాన్య మానవునిగా పుట్టిన గాంధీజీ తెల్ల దొరలను శాంతి అహింస అను ఆయుధాలతో తరిమికొట్టేందుకు ఎన్నో పోరాటాలు చేశారు. ఈ సమయంలో యావత్ భారత వాణి అంతా అతని శాంతియుత పోరాటానికి మద్దతు పలికింది. కోట్లాదిమంది జనాలు ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంలో ఆయన విశ్వం మొత్తానికి ఆదర్శంగా నిలిచారు. నా జీవితమే నా సందేశమని చాటి చెప్పిన మహనీయుడు గాంధీజీ. అహింసా మార్గంలోనే ఆయన సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. ప్రపంచానికి ఆయన అందించిన పదునైన ఆయుధం అది. మహాత్మా గాంధీ అందించిన అహింస ఉద్యమం యావత్తు ప్రపంచానికి పూర్తిగా నిలిచింది. భారతదేశం గర్వించదగిన మహనీయులలో మహాత్మా గాంధీ ఒకరి కంటే ముందుంటారని చెప్పవచ్చు. భారతావనికి స్వేచ్ఛ స్వతంత్రం అందించడం కోసం చేసిన పోరాటానికి గాంధీజీ ఎంచుకున్న శాంతి, అహింస మార్గం భారతీయులకే కాదు యావత్తు ప్రపంచానికే మార్గదర్శకం అయిందని అన్నారు. ఈ కార్యక్రమానికి మండల ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఎస్కే జానీ భాష, మండల సహాయ కార్యదర్శి షేక్ బాజీ బాబా తదితరులు పాల్గొన్నారు.