జనసేన కార్యకర్త కుటుంబానికి అండగా నిలచిన గర్భాన

పాలకొండ నియోజకవర్గం, పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం, వీరఘట్టం గ్రామ కాపురస్తులు జనసేన కార్యకర్త సోండి. సుమన్, అమల కుటుంబం ఆర్దికంగా ఇబ్బందులు పదుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న స్థానిక నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు వారి ఇంటికి వెళ్లి వాళ్ల సాధక బాధకాలు తెలుసుకొని వారి కుటుంబానికి 15000/-రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అంటే మా కుటుంబంతో సమానం మా కుటుంబంలో ఎవరికి ఏ విధంగా సమస్య వచ్చినా మేము అంతా కలిసికట్టుగా వాళ్లకు అండదండగా నిలబెడతాము అని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న జనసేన కార్యకర్తలకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మరోసారి తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు సతివాడ.వెంకటరమణ, గర్భాపు.నరేంద్ర, కోడి.వెంకటరమణ, జల్లు.సోముబాబు పాల్గొన్నారు.