ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం – తగరపు శ్రీనివాస్

తెలంగాణ, హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడుతూ వివరాలు తెలుసుకోగా, వైద్యులు సమయానికి రావడం లేదని, ఆసుపత్రి సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, సెలైన్ ఎక్కించి మరిచిపోతున్నారని, ఏ అధికారులకైనా పిర్యాదులు చేసుకొమ్మని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు కావడంతో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి ప్రజలు ఆసుపత్రికి ఎక్కువగా వస్తుంటారని అన్నారు. ఆరోగ్య శాఖామంత్రి సొంత జిల్లాలోనే వైద్యాధికారులు, నిబంధనలు తుంగలో తొక్కుతూ, బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎలా అన్నారు. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకొని, సరైన వైద్యం అందించాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మల్లెల సంతోష్, మోరె శ్రీకాంత్, రాజేష్, రమేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.