పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ఖండించిన గరికపాటి వెంకట్

దర్శి, ప్రజా గొంతుకను నొక్కి వేస్తూ పత్రికా స్వేచ్ఛను వైసిపి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు కాలరాస్తున్నారని గరికపాటి వెంకట్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన పత్రికలు, మీడియాపై దాడులు హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పత్రికలపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. అనంతపురంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి, కర్నూలులో ఈనాడు కార్యాలయం పై దాడి ఇలా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఓటమి భయంతో వైసీపీ నేతలు దాడులకు దిగడం పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించడమే. ఎన్ని దాడులు చేసినా ప్రజా గొంతుక మూగబోదు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, జనసేన తెలుగుదేశం కూటమికి జనాదరణ చూసి ఓటమి భయంతో వణికి పోతున్న వైసిపి నేతలు ఇలా దాడులకు తెగబడ్డారని జనసేన నాయకులు గరికపాటి వెంకట్ ఆరోపించారు. వెంటనే జర్నలిస్టులకు, పత్రికలకు, పత్రిక కార్యాలయాలకు, రక్షణ కల్పించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.