పలు కుటుంబాలను పరామర్శించిన గెడ్డం బుజ్జి

పాయకరావుపేట నియోజకవర్గం, కోటవురట్ల మండలం గొల్లపేట అనే ఏరియాలో గోపి ఆరోగ్య పరిస్థితి బాగోక నడుముకు సర్జరీ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డంబుజ్జి పరామర్శించి ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను ఉన్నానని వాళ్ళ కుటుంబ సభ్యులకి భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం పాత గొట్టివాడ జనసైనికుడు తాతాజీ ఆటో యాక్సిడెంట్ లో గాయాలు అయిన కారణంగా విషయం తెలిసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డంబుజ్జి, తాతాజి ఇంటికి వెళ్లి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకి భరోసా ఇవ్వడం జరిగింది.