అగ్నిప్రమాద బాధితులకు అండగా గిడ్డి సత్యనారాయణ

డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలం, పోతవరం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్దిమేని మంగయమ్మ, పెద్దమేని శ్రీనివాసరావులకు చెందిన ఇల్లుల కాలి బూడిద అవడం జరిగింది. ఈ ఘటన తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వలన జరగడంతో ఇళ్ళు, ఇంట్లో ఉన్న బట్టలు, వంట సామాగ్రి, మొత్తం కాలిపోయాయని కట్టుబట్టలతో మిగిలామని బాధితులు వాపోయారు. ఈ ప్రమాదంలో ఒక లక్ష రూపాయలు నగదు, రెండు కాసులు బంగారం, రెండు బీరువాలు మరియు లక్ష రూపాయలు విలువైన ప్లంబింగ్ మిషన్ అగ్నికి ఆహుతి అయ్యాయి. పి.గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గిడ్డి సత్యనారాయణకు ఈ విషయం తెలిసిన వెంటనే సోమవారం ఉదయం హుటా హుటిగా అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి బాధితులను ఓదార్చి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని తన వంతు సహాయంగా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు మరియు బియ్యం ప్యాకెట్లు, వంట సరుకులు ఇచ్చి మీకు అన్ని విధాలుగా అండగా జనసేన పార్టీ ఉంటుందని బాధితులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో పి.గన్నవరం మండలం ముంగండ పాలెం గ్రామంలో 60 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేన పార్టీ తీర్థం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు ముంగండ పాలెం గ్రామంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినేడి వెంకటేశ్వరరావు, పి.గన్నవరం నియోజకవర్గం ఇంచార్జ్ గిడ్డి సత్యనారాయణ పాల్గొనడం జరిగింది. గిడ్డి సత్యనారాయణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు, సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుండి రోజురోజుకి మద్దతు తెలుపుతున్నారని రాబోయే రోజుల్లో ప్రభుత్వం రాబోతుందని మన నియోజకవర్గంలో ఉన్న పేదరికాన్ని తీసివేయడం జనసేన పార్టీతోనే సాధ్యమని ప్రతి పేదవారికి అండగా ఉండే పార్టీ ఏదైనా ఉందా అంటే అది కేవలం జనసేన పార్టీ అని, ఏ పార్టీ చేయలేని పనులు కేవలం జనసేన పార్టీ చేస్తుందని అన్నారు. అలాగే గిడ్డి సత్యనారాయణ ఊడిమూడి, గంటి పెదపూడి, బూరుగులంక, అరుగుల వారి పేట, ఊడిమూడి లంక గ్రామాలు భారీ ర్యాలీతో పర్యటన చేశారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి కుమార్, సాధనాల శ్రీ వీర వెంకట సత్యనారాయణ, ఎంపీపీ నాగలక్ష్మి, వెంకటేష్, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.