గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 22వ రోజు

పాలకొండ, పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గఒ, వీరఘట్టం మండలం 22వ రోజు గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా వీరఘట్టం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన జనసైనికులు. ముందుగా మత్స పుండరీకం మాట్లాడుతూ మంత్రి ఆర్.కె రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి తిరుమల శ్రీవారి ఆలయ ప్రాగణంలో రాజకీయగురించి మాటలు అనవలసిన అవసరం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఓ హిరణ్యకశిపుడు ప్రతి పధకంలో వైస్సార్, జగన్ పేరులు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ జనం జగన్ నామమే స్మరించాలి అన్న రాక్షస ఆలోచనతో ఉన్నాడు. పర్యటన శాఖ మంత్రిగా నిణీ విధులు సక్రమంగా నిర్వహించు, ఇంత వరకు రాష్ట్ర మంత్రిగా నీవు చేసింది ఏమిటి? హిరణ్యకశిపుడు వై.స్.జగన్ పాలనలో ప్రజలు ఆర్తనాదలు గడప గడప కి వెళ్ళినప్పుడు వినిపించలేదా మంత్రి రోజా అని ప్రశ్నించారు. ప్రజలు బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నదే జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యం అని అన్నారు. ప్రతి జనసైనికుడు ఓ భక్త ప్రహ్లాదుడు అని, పవన్ కళ్యాణ్ ప్రజల హృదయాలలో కొలువున్న దేవుడు అని అన్నారు. రాష్ట్రంలోని మంత్రులు మీడియా ముందు పవన్ కళ్యాణ్ గురించి అతిథిగా మాట్లాడితే బాగోదాని మీ మీ మంత్రి పదవులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండిని అన్నారు. బి.పి.నాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ సందేశాలను చదివి వైస్సార్సిపి పార్టీ సీఎం జగన్ కి మంత్రులకు, ఎం.యల్.ఏ లకు, నాయకులకు భయం పట్టుకుంది, పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాష్ట్ర మొత్తం జనసేన బస్సు యాత్ర చేస్తే వైస్సార్సీపీ పార్టీ షెటర్ క్లోజ్ చేసుకోవడం తధ్యం అన్నారు. జనసేన జాని మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన నిలబడి రైతు భరోసా, జనవాణి, నిరుపేదలకు అండగా ఉండి ఆదుకోవడం చూసి వైస్సార్సీపీ నాయకులు కళ్ళు, చెవులు పొడుసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ ఓడించడం ఖాయం, జనసేన పార్టీ అధికారం చేపట్టడం తథ్యం అని అన్నారు. కర్ణేన సాయి పవన్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఇంతవరకు ఎటువంటి ఉద్యోగ ప్రకటన లేవు, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందడం లేదు రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దూసి ప్రణీత్ పాల్గొన్నారు.