బ్రిడ్జ్ నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలి: డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, జనసేన నాయకులు డాక్టర్ శ్రీధర్ పిల్లా పిఠాపురం నుండి సామర్లకోట వెళ్ళు రహదారి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్ కూలిపోయి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. దీనికి స్పందించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా మీడియా సమక్షంలో మాట్లాడుతూ పిఠాపురం నుండి సామర్లకోట వెళ్లే ముఖ్య రహదారి కొన్ని వేల మంది రైతుల కొన్ని వేల మంది ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని జనసేన పార్టీ తరపున పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు, డాక్టర్లు డిమాండ్ చేయడం జరిగింది. ఈ రహదారి రెండు నియోజకవర్గాలను కలుపు ముఖ్య రహదారి, చిరు వ్యాపారస్తులు, రైతులు, ఉద్యోగస్తులు, ప్రయాణికులు ఆటో సోదరులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల ఈ బ్రిడ్జికి అనుకుని ఉన్న స్మశాన వాటిక మునిగిపోయి స్మశానంలో ఉన్నటువంటి సవాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితిలో ఉందని తెలపడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి శ్రీపాద వల్లభ దేవస్థానాన్ని దర్శించుకోవడం కోసం వచ్చేటువంటి వేలాది భక్తులు కూడా రోడ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారని మన రాష్ట్ర రోడ్ల దుస్థితిని ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాప్తింపచేసేలా ఉందని వాపోయారు, రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా సొంత జిల్లా వారు అయినప్పటికీ ఈ రోడ్లను పట్టించుకోనటువంటి దుస్థితిలో ఉన్నారని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ని తిట్టడం మీద ఉన్న శ్రద్ధ తన మంత్రిత్వ శాఖ మీద పెట్టి, తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని డాక్టర్ శ్రీధర్ పిల్లా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధికార ప్రతినిధి తోలేటి శిరీష, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, బత్తిన వీరబాబు, గంజి గోవిందరాజులు, వాకపల్లి సూర్య ప్రకష్, చక్రి, వీరబాబు, నాగేశ్వరావు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.