గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 26వ రోజు

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసేన పార్టీ జనసేన గిరిసేన 25 వ రోజు కార్యక్రమంలో భాగంగా ముందుగా జనసేన జానీ మాట్లాడుతూ భారత అణు పితామహుడు, మానవతావాది, భారత అణు వైజ్ఞానిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, భారత పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు మిస్సైల్ మాన్, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ తరుపున మా తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. మత్స పుండరీకం మాట్లాడుతూ ది మిస్సెల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతదేశ 11వ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రజ్ఞుడు, యువతకు మార్గ నిర్దేశకుడు ఆయన జీవితాంతం దేశ ప్రతిష్ట కోసం తపించిన దేశభక్తుడు అని చెప్పడం జరిగింది. షేక్ అజాద్, మాట్లాడుతూ భారత మాజీ ప్రధమ పౌరుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్బంగా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరుపునుంచి, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలు తరుపునుంచి, వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులు సాయిపవన్, సొండి సుమన్, దూసి ప్రణీత్, బొమ్మాళి వినోద్, జరాజపు రాజు పాల్గొన్నారు.