ఘనంగా ఆకుల సుమన్ జన్మదిన వేడుకలు

ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ ఆకుల సుమన్ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన అధ్యక్షుడు ఆలేటి నరేందర్ ఆధ్వర్యంలో ఆకుల సుమన్ పుట్టినరోజు చెంపకిల్స్ అనాధ పిల్లల హాస్టల్ లో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ లో బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. మరియు శ్రీ రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆకుల సుమన్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంద నాగరాజు, జానీ, క్రాంతి, రాకేష్, మంద పవన్ కుమార్, నాగరాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.