విద్యుత్ వైర్లు తగిలి మృతిచెందిన యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలి

*కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం మండలంలోని అడ్డాపుశిల గ్రామంలో సచివాలయం సమీపంలో బుధవారం లారీ నుండి విత్తనాల వరి ధాన్యం బస్తాలు దించే సమయంలో కరెంటు వైర్లు తగిలి మృతిచెందిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. బుధవారం పార్వతీపురం జిల్లా ఆస్పత్రి వద్ద మృతుడు సాయికుమార్ కుటుంబ సభ్యులు కలిసి వారు పరామర్శించారు. ఈ సందర్భంగా సంఘటనకు సంబంధించిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు చందక అనిల్ కుమార్, వంగల దాలి నాయుడు, రాజాన రాంబాబు, బంటు శిరిష్ తదితరులు మాట్లాడుతూ వరి విత్తనాలు తెచ్చుకునేందుకు మేడ పైకి వెళ్లి విద్యుత్ వైర్లు తగిలి సాయికుమార్ మృతి చెందడం బాధాకరమన్నారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా సరఫరా చేయాల్సిన విత్తనాలు, కలాసీల ద్వారా ఇవ్వాలన్నారు. కానీ ప్రభుత్వం అధికారులు అవి పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. నిబంధనలు పాటించక పోవడం వల్లే యువకుడు మృతి చెందాడని వారు ఆరోపించారు. ప్రభుత్వం కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. చదువుకొని కుటుంబాన్ని ఆడుకునే కుమారుడి మృతి ఆ కుటుంబానికి తీరని లోటన్నారు.