పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ వేసవికి సినిమా ను రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్‌, అంజలి, నివేథా థామస్‌, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా న్యూ ఇయర్ (జనవరి 1) రోజున వకీల్ సాబ్ టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈసారి పవన్ ఫ్యాన్స్ ఏమాత్రం నిరాశ చెందకుండా వకీల్ సాబ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇవ్వనున్నారనే వార్త ప్రస్తుతం ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతుంది.