రాజాం నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జిగా గొర్లె గోవిందరావు

రాజాం నియోజకవర్గం: స్థానిక శ్రీ సాయి నవదుర్గ కళ్యాణమండపంలో కాపు సంక్షేమ సేన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన బలోపేతం దిశగా రాజాం నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జ్ గా గొర్లె గోవిందరావును, రాజాం మండల అధ్యక్షులుగా సామంతుల రమేష్ ను, సంతకవిటి మండలం అధ్యక్షులుగా మీసాల రాంబాబును, రేగిడి ఆమదాలవలస మండల అధ్యక్షులుగా రెడ్డి బాల మురళీ కృష్ణను వంగర మండలం అధ్యక్షులుగా బురాడ శ్రీనివాస్ ను నియిమించినట్టు కాపు సంక్షేమ సేన ఉత్తరాంధ్ర ఇంచార్జ్ గుర్రాల శ్రీనివాస్ తెలియజేసారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షులు మజ్జి సుమన్ చేతుల మీదగా నియమక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కరణం కళావతి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మజ్జి సుమన్, మహిళా అధ్యక్షురాలు వడ్డపల్లి జ్యోతిర్మయి, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు అర్జున్ కుమార్ భూపతి మరియు తూర్పు కాపు జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పొగిరి సురేష్, జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు, పైడి రాజు ఎంపికైన నాలుగు మండలాల కాపు సంక్షేమ సేన ఉపాధ్యక్షలు ప్రధానకార్యదర్శిలు కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్నికైన వారికీ రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యు.పి రాజు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసారు. జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ కాపు సంక్షేమ సేన సభ్యులను కోరారు.