వైస్సార్సీపీ కి షాక్ ఇచ్చిన యువ నాయకులు

  • జనసేన పార్టీలో జాయిన్ అయిన వైస్సార్సీపీకి చెందిన యువ నాయకులు

రాజానగరం: శ్రీకృష్ణపట్నం గ్రామానికి చెందిన యువ నాయకులు బండారు రవి, భీమన వివేక్ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి.. రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం చేస్తున్న సేవలు నచ్చి.. ఆదివారం రాజమండ్రిలో బలరామకృష్ణ నివాసంలో మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరికి జనసేన పార్టీ కండువా కప్పి జనసేన ఆపార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణపట్నం జనసేన నాయకులు సుంకర బాబ్జి, హరికృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.