చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

భైంసా: ఐలమ్మ వర్ధంతి అందర్భంగా ఆదివారం భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనం ముందర ఐలమ్మ గద్దె వద్ద జనసేన, రజక సంఘం, బిసి సంఘాల ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ రజకులు, ఎస్ సి, ఎస్టి, బిసిలు ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఉద్యమంగా తీసుకొని చేసిన పోరాట ఫలితమే నేడు తెలంగాణలో ఐలమ్మ వర్ధంతి, జయంతిలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారు. ఆనాటి కాలంలో మాట్లాడే హక్కు కూడా లేని దొరల పాలనలో కొంగు నడుముకు చుట్టి కొడవలి చేత బట్టి దొరల అహంకారాన్ని కూకటి వేళ్లతో కదిలించి పేద కుటుంబాలకు లక్షల ఎకరాల భూమిని పంచి దున్నే టోనిదే భూమి రా అంటు నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుక వచ్చి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ అలాంటి త్యాగాన్ని గుండెల్లో నింపుకొని యువత ముందుకు సాగాలని కోరుతున్నాం. అదేవిధంగా ఐలమ్మ కుటుంబంలో ఒకరినీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలి. రజకుల చిరకాల స్వప్నం అభివృద్ధిలో అట్టడుగులో వున్న రజక జాతిని ఎస్ సి జాబితాలో చేర్చి అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు శ్రీను, భుమేష్, ముత్యం వడ్ల సంఘం నాయకులు గంగాప్రసద్, భూషణ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గైనీ మురళి, విఠల్, ప్రకాష్, జనసైనికులు అర్జున్, రాజు, కరీం, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.