జగనన్న కాలనీలు నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైంది: వడ్రాణం

రెండవ రోజు గుంటూరు పట్టణంలోని 16వ డివిజన్ ఏటుకూరు గ్రామంలో #ఫైలురెఒఫ్జగనన్నచొలొనిఎస్ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టి నాయకులు వడ్రాణం మార్కండేయ బాబు, నేరేళ్ళ సురేష్ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలను ఆదివారం ఉదయం పరిశీలించినారు. జఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టి రాష్ట్ర కార్యదర్శి శ్రీవడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగనన్న కాలనీలు నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతులు నుండి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి వై.సి‌.పి నాయకులు లబ్ధిపోందటం జరిగినది. ఈ కాలనీలలో సరైన సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మార్కండేయ బాబు అన్నారు. నగర అధ్యక్షులు శ్రీ నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా జనసైనికులు, వీరమహిళలు యువకులు అందరం కలిసి జగనన్న కాలనీలు సందర్శించినామని అన్నారు. ప్రతిచోట సరైన రోడ్లు లేక ఈస్థలాలో చెట్లు మెలకెత్తడం, నీరు నిలవడం, 24గంటలు వీధిలైట్లు వెలుగుతూ వున్నాయని అన్నారు. పేదలకు సరైన న్యాయం జరగక ఇళ్ళు నిర్మాణాలు నత్తనడకన నడుస్తూండడడం చాలా హాస్యాస్పదంగా ఉందని సురేష్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మి దుర్గ, జిల్లా ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లికా, జిల్లా ఆధికార ప్రతినిధి ఆళ్ళ హరి, రాష్ట్ర రెల్లి సంఘం నాయకులు సోమి ఉదయ్, గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, యడ్ల నాగమల్లేశ్వరరావు, కటకం శెట్టి విజయలక్ష్మి, మీడియా కోర్దినేటర్ పుల్లంశెట్టి ఉదయ్ నగర ప్రధాన కార్యదర్శి సూరిశెట్టీ ఉదయ్, కార్యదర్శులు బండారు రవీంద్ర, పావులూరి కోటేశ్వరరావు, తోట కార్తీక్, పులిగడ్డ గోపి, మాదాసు మాధవ, తిరుమలశెట్టి కిట్టు, మహంకాళి శ్రీనివాసరావు, మిద్దె నాగరాజు, దాసరి వెంకటేశ్వరరావు, మధులాల్, కాపు సంక్షేమ సేన గుంటూరు జిల్లా కార్యదర్శి ప్రతివాడ గంగాధరరావు, కోమ్మా వాసు, దాసరి వాసు, శివాలశెట్టీ శ్రీనివాసరావు, జిడుగు నాగయ్య,దాది ఆంజి, అములోతు నాగరాజు, కవలాశ్రీను, వీరమహిళలు శ్రీమతి పాకనాటి రమాదేవి, నిశ్శంకరరావు అనసూయ, జంజనం మల్లేశ్వరి, మేకల సాంభ్రాజ్యం హరిసుందరి, ఆసియా, ఆషా, రాజనాల నాగలక్ష్మి, ఆరుణ, బడే నాగేశ్వరరావు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.