ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. APCPDCL లో జూనియర్ లైన్ మ్యాన్ జాబ్స్
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపై ఆశలు పెంచుకున్న యువత నిరుత్సాహపడుతున్న తరుణంలో వివిధ ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) గ్రామ, వార్డు సచివాలయాల కింద 86 ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం గ్రేడ్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టు పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం గ్రేడ్-2)
మొత్తం ఖాళీలు: 86
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
గమనిక: ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయసు, పరీక్ష విధానం, సిలబస్ వివరాలు, దరఖాస్తు తేదీలు వంటి పూర్తి వివరాలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://apcpdcl.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.