1679 సెంట్రల్‌ గవర్నమెంట్‌ జాబ్స్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌ (BECIL) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1679 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 20లోగా అప్లయ్‌ చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల్లో స్కిల్డ్, అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పోస్టులు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి బీఈసీఐఎల్ ట్రైనింగ్ కోర్సును నిర్వహిస్తుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి.. ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కనీసం 50 శాతం మార్కులు సాధించిన వారికి వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు.

విద్యార్హతలు:

Skilled Manpower: ఈ పోస్టులకు ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్ మెన్ తదితర విభాగాల్లో ఐటీఐ సర్టిఫికేట్ పొందిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. NCVT, SCVT నుంచి గుర్తింపు పొంది ఉండాలి. ఎలక్ట్రికల్స్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి.

Un Skilled Manpower: ఈ పోస్టులకు ఏదైనా స్టేట్ బోర్డులో 8వ తరగతి పాసైన్ వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎలక్ట్రికల్ విభాగంలో ఏడాది పాటు అనుభవం ఉండాలి.

Semi Skilled Manpower: ఈ పోస్టులకు ఇంటర్‌/12వ తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు డీసీఏ, పీజీడీసీఏ కోర్సుల్లో ఏడాdr కోర్సు చేసి ఉండాలి. ఇంగ్లిష్, హింది టైపింగ్ పై అవగాహన, అనుభవం ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

ఇలా దరఖాస్తు చేసుకోండి:

ఈ పోస్టులకు సంబంధించి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో https://www.beciljobs.com/ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హత, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, పాన్ కార్డు, ఆధార్ కార్డుకు సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటో కాపీలను అప్ లోడ్ చేయాలి.

పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 590 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు పరీక్ష ఫీజును రూ. 295 గా నిర్ణయించారు.

ఎంపిక: ఈ పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.

వేతనం: పోస్టులను బట్టి రూ.16,000 నుంచి రూ.37,500 వరకు ఉంటుంది.

అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్