మీడియాకు మ‌ద్ద‌తుగా నిలిచిన ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం

డిజిటల్ ప్రపంచంలో దిగ్గజాలుగా నిలిచిన ఫేస్‌బుక్, గూగుల్ సంస్థ‌ల‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి కారణం మీడియా సంస్థ‌లు ఎంతో కష్టపడి సేకరించిన సమాచారాన్ని మరియు వార్తా కధనాలను కాపీరైట్ కింద ఎలాంటి రుసుము వార్తాపత్రికలకు చెల్లించకుండా మరియు వార్తా కధనాల అనుమతి లేకుండానే డిజిటల్ సంస్థలు వారికష్టాన్ని దోచుకుని సొమ్ము చేసుకుంటున్నాయని పలు మీడియా సంస్థలు ఆరోపించడంతో పాటూ ఆవేదన వ్యక్తం చేసాయి. అందుకు గాను తమ ద్వారా వచ్చిన ఆదాయాన్ని తమ ప్రభుత్వానికే చెల్లించాలంటూ అదేశిoచాయి. దేనికోసం అతి త్వరలో ఆ విషయంపై సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని దానికి ఒప్పుకోకుంటే కోడ్ ఉల్లంఘిన్చినట్లుగా భావించి 7 మిలియ‌న్ డాల‌ర్ల వరకు జ‌రిమానా విధిస్తామ‌ని ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి జోష్ ఫ్రైడెన్‌బర్గ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.