Ramachandrapuram: రైతులకు తక్షణమే నష్టపరిహారం ఎకరాకు 30,000 చెల్లించాలి

అకాలవర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం ఎకరాకు 30,000 చెల్లించాలి.

రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్.

రామచంద్రపురం రూరల్ వెల్ల గ్రామంలో పూర్తిగా నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దాన్యం మెుత్తం మెులకలు వచ్చి భారీస్థాయిలో నష్టపోయిన రైతులు. సర్వేల రూపంలో వచ్చి పేర్లు నమోదు చేసుకోవడం తప్ప ఎవరికి సహయం అందడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఉండి కూడా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి ఇంత మెుత్తంలో రైతులకు భరోసా ఇస్తామని కూడా ఇప్పడి వరకు ఒక్క భరోసా ఇవ్వలేదు. రామచంద్రపురం నియోజకవర్గం నుండి మంత్రిగా ఉన్న చెల్లుబోయున వేణుగోపాలకృష్ణ గాని అతి తక్కువ సమయంలో ఖచ్చితంగా రైతుకు ఏమి చేస్తారో చెప్పాలని చెప్పలేని పక్షంలో ఈ విషయంలో రైతుల వెనక ఉండి జనసేన పార్టీ తరపున రైతుల పక్షాన పోరాడతామని రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ మీడియా పూర్వకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. వెల్ల గ్రామం జనసేన పార్టీ MPTC 1 చిక్కాల స్వామికాపు, జనసేన నాయకులు మంచెం ఈశ్వరుడు, అక్కిరెడ్డి శ్రీను, తదితర వెల్ల గ్రామం జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.