వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: వేగుళ్ళ లీలాకృష్ణ

  • మంగళవారం బాధితుల ఇక్కట్లపై ముఖ్యమంత్రికి విజ్ఞాపన…
  • విజ్ఞాపన తీసుకోని పక్షంలో జనసేన నిరసన…
  • తక్షణమే బాధితులకు పదివేలు రూపాయలు సాయం చేయాలని వేగుళ్ళ లీలాకృష్ణ డిమాండ్…

మండపేట: గోదావరి వరదల కారణంగా నిరాశ్రయులైన రైతాంగం, ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇక్కట్లపై వారిని ఆదుకోవడం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రికి జనసేన పార్టీ తరుపున విజ్ఞాపన అందచేస్తామని మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రిని జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు మరియు జిల్లా పార్టీ నేతలతో కలిసి విజ్ఞాపన ఇవ్వాలని నిర్ణయింఛామని ఆయన తెలిపారు. విజ్ఞాపన తీసుకొని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసన తెలియచేస్తామని చెప్పారు. కేవలం వరద బాధిత కుటుంబాలకు 2000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఇదే వైసీపీ నేతలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గోదావరికి వరదలు వస్తే బాధితులకు 25 వేల రూపాయల తక్షణ సాయం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బాధితులకు రూ.2 వేలు ఇచ్చి సరిపెడుతున్నారని చెప్పారు. మంచి పరిపాలకుడు అంటే ప్రమాదం వచ్చిన తర్వాత పరామర్శించడం కాదు, ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ప్రజలను కాపాడుకోవడమే సుపరిపాలకుడి లక్షణం అన్నారు. గోదావరి వరద బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు.

బాధితులు పక్షాన జనసేన పోరాటం…

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పూర్తిగా గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ, కనీసం ముఖ్యమంత్రిని జనసేన పార్టీ తరపున తాము కలిసేందుకు ఇప్పటికే అధికారులను అనుమతులు కోరాం అన్నారు. అనుమతి ఇవ్వని పక్షంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటి పెదపూడలో ముఖ్యమంత్రి నిర్వహించే కార్యక్రమం పట్ల నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. ముంపు బారిన పడిన ఒక్కో కుటుంబానికి తక్షణం పదివేలు సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ముంపు గ్రామాల్లో పంట నష్టాన్ని మదింపు చేసి, ఆ మేరకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కావున ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జిలు, రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

బాధితులు పక్షాన జనసేన పోరాటం…

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పూర్తిగా గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ, కనీసం ముఖ్యమంత్రిని జనసేనపార్టీ తరపున తాము కలిసేందుకు ఇప్పటికే అధికారులను అనుమతులు కోరాం అన్నారు. అనుమతి ఇవ్వని పక్షంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటి పెదపూడలో ముఖ్యమంత్రి నిర్వహించే కార్యక్రమం పట్ల నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. ముంపు బారిన పడిన ఒక్కో కుటుంబానికి తక్షణం పదివేలు సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ముంపు గ్రామాల్లో పంట నష్టాన్ని మదింపు చేసి, ఆ మేరకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కావున ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జిలు, రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.