ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు వాస్తవం, వైసీపీ ఎంపీ మాట అక్షర సత్యం

పెడన నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లో రైతుల కష్టాలు రాస్తే రామాయణం అవుతుంది, చెబితే మహాభారతం అవుతుంది. గతంలో అనేకమార్లు ధాన్యం కొనుగోలు పై మాట్లాడటం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల మాటలను పెడచెవిన పెడుతోంది. వైసిపి అమలు చేస్తున్న ఆర్ బి కే విధానం చాలా లోపభూయిష్టమైనది. వాస్తవం చెప్పాలంటే ఆర్ బి కే లు రైతు భరోసా కేంద్రాలు కావు. అవి రైతు దగాకోరు కేంద్రాలు. రైతు మొదట ఆర్.బి.కె లో ఈ క్రాఫ్ నమోదు తర్వాత, ఆ ఆర్.బి.కె కి అనుసంధానం అయినా మిల్లర్లకు ధాన్యం అమ్మాలి. కానీ ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలు ఏ మిల్లర్ రైతుకు ఇవ్వడు. రకరకాల కారణాలతో ధరల్లో కోత విధిస్తాడు. గత్యంతరం లేని పరిస్థితిలో రైతులు మిల్లర్ చెప్పిన ధరకే విక్రయిస్తున్నారు. కానీ మిల్లర్ ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం ప్రభుత్వం నుంచి లబ్ది పొందుతున్నారు. అంతేకాకుండా ఇంకోసారి మిల్లర్ లకు కాకుండా స్థానిక ఉన్న మధ్యవర్తులకు అమ్ముతూ ఉంటారు. మధ్యవర్తి కి మిల్లర్ కు మధ్య ఒప్పంద ఉంటుంది. ఇప్పటివరకు ఏ రైతుకు కూడా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర లభించలేదు. వైసిపి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రైతు ఇబ్బంది పడుతున్నాడు.

*మిల్లర్లు, మధ్యవర్తులు లాభపడుతున్నారు.

వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లు బస్తా కి 200 రూపాయలు అవినీతి జరుగుతుంది అన్నారు. కానీ నిజానికి కొన్ని సందర్భాల్లో బస్తా కి 300 నుండి 400 రూపాయల వరకు రైతు నష్టపోతున్నాడు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల నిజమైన ప్రేమంటే ప్రతి రైతు కి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వచ్చే విధంగా ఆర్ బి కే విధానాలను సవరించాలి. ముఖ్యంగా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలల నుంచి నాలుగు నెలలు కావస్తోంది. రైతులకు ధాన్యం అమ్మకం తాలూకు డబ్బులు రాలేదు.

వైసీపీ ప్రభుత్వం రైతు దగాకోరు ప్రభుత్వం
వైసీపీ విధానాలు రైతు వ్యతిరేక విధానాలు.

పవన్ కళ్యాణ్ తమ కష్టార్జితాన్ని 30 కోట్ల రూపాయలు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు, లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తుంటే, దీన్ని కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి నీచంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్రను ముఖ్యమంత్రి ఎగతాళి చేస్తూ, రైతులను తీవ్రంగా అవమానిస్తారు. మీ ఎంపీ చేసిన ఆరోపణలపై తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. సి బి ఐ ఎంక్వయిరీ వేసి నిజాలు తేల్చాలి. మాది రైతు ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని ప్రకటనలో చెప్పుకోవడం, బహిరంగ సభలో మాట్లాడడం కాదు. నిజంగా మీది రైతు ప్రభుత్వం అయితే మీ ఎంపీ ఆరోపణలపై ముఖ్యమంత్రి నోరు విప్పాలని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్.వి. బాబు అన్నారు.