ప్లాస్మా డోనర్లకు రాఖీలు కట్టి సన్మానించిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రక్షా బంధన్ వేడుకలను కొత్త తరహా లో జరుపుకొన్నారు. రక్షా బంధన్ సందర్భంగా ప్లాస్మా డోనర్లను గవర్నర్ సన్మానించారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేసిన 13 మంది ప్లాస్మా దాతలకు రాఖీలు కట్టి, స్వీట్లు పంచి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్లాస్మా డోనర్లను  ప్రశంసించారు. కరోనా వేళ ప్రభుత్వ ఆసుపత్రులు అమోఘమైన సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా డోనేట్ చేసిన వీరికి ప్రభుత్వ హాస్పిటళ్లలో విజయవంతంగా చికిత్స అందించిన వైద్య సిబ్బందిని గవర్నర్ అభినందించారు.