100 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకొనే దిశగా అడుగులు వేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బేగంపేటలో జితో కోవిడ్‌కేర్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. పేదల కోసం 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా వస్తే చనిపోతారనే అపోహ సరికాదని చెప్పారు. రాష్ట్రంలో 99 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నారని హరీష్‌రావు వెల్లడించారు.

కేసీఆర్‌ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కరోనా నియంత్రణకు కృషి చేస్తోందని తెలిపారు. వేరే అనారోగ్య సమస్యలతో బాధపడే వారు, ఆస్పత్రుల్లో చేరడం ఆలస్యం చేసిన వారిలో కొంత మంది మృతి చెందుతున్నారని మంత్రి హరీష్ రావు వివరించారు. కరోనా వచ్చిన వారిని ఊళ్లలోకి రావద్దనడం, అద్దె గదులు ఖాళీ చేయమనడం సరికాదని హితవుపలికారు. కరోనా బాధితులకు సేవలు అందించడంలో శ్రద్ధ చూపాలని వైద్య సిబ్బందికి ఆయన సూచించారు.

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతూ రోగులకు సరిగా వైద్యం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్న ఈ తరుణంలో మంత్రి హరీష్ రావు హైదరాబాద్ పరిధిలో కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించడం విశేషం.