రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి: అవనిగడ్డ జనసేన

అవనిగడ్డ నియోజకవర్గం లో వరి కోతలు ప్రారంభమై యంత్రాల ద్వారా అన్నిచోట్ల కూడా కోతలు కోసి, రోడ్లు ప్రక్కన ధాన్యపు రాశులు పోసుకుని సరైన గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ధాన్యమును కొనుగోలు చేయాలని అవనిగడ్డ మండల జనసేన నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాన్య వరి రకం 2040 రూపాయలు, గ్రేడ్ ఆ రకం 2060 రూపాయలు మద్దతు ధర ప్రకారం రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని తేమశాతం 17 ఉంటే మాత్రమే మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తామని అధికారులు చెప్తున్నారని, తుఫాను కారణంగా వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రకారం ధాన్యంలో తేమశాతం 20 కు పైన ఉంటుందని తేమ శాతంతో సంబంధం లేకుండా మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం కుంటి సాకులు చెప్పకుండా, తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని సూచించారు. ఒక టన్ను దాన్యం కు రవాణా ఖర్చులు 220 రూపాయలు, హమాలీ ఖర్చులకి 250 రూపాయలు ఇస్తుందని వాస్తవ పరిస్థితుల్లో ఇవి ఏమాత్రం సరిపోవటం లేదని, రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే ఈ వైసీపీ ప్రభుత్వం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా హమాలీ ఖర్చులు 500 కు పైబడి, రవాణా చార్జీలు 500 కు పైబడి పెంచాలని, అలాగే రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, ఎంపీటీసీ బొప్పన భాను, మండలి శివప్రసాద్, పప్పుశెట్టి గోపీనాథ్, తుంగల నరేష్,
కమ్మిలి సాయి భార్గవ, కోసూరి అవినాష్, అప్పికట్ల శ్రీ భాస్కర్, రేపల్లె రోహిత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.