గిరిజనుల సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి:సాయిబాబా దురియా

అరకు నియోజకవర్గం, బొండం పంచాయతీ సచివాలయంలో నేడు జరిగిన గ్రామసభలో గిరిజనుల సమస్యలు పరిష్కారం కోసం గళం ఇప్పుతూ మాట్లాడిన జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి నేటి వరకు ఇల్లు నిర్మించి ఇవ్వలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బోయ వాల్మీకి బెంతు, ఒరియా (బిసి)లను ప్రభుత్వం ఎస్టిగా రిజర్వేషన్ కల్పిస్తానని సామ్యూల్ ఆనంద్ కమిటీని నియమించడం ఎంతవరకు సమంజసం అని, ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 52 ను రద్దు చేయాలనిఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులుపాల్గొన్నారు.