తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: మనుబోలు

తిరువూరు నియోజకవర్గం, విసన్నపేట మండలంలో మిచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ బాద్యులు మనుబోలు శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విస్సన్నపేట మండల నాయకులతో కలిసి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విసన్నపేట పరిసర ప్రాంతాల్లో తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పొలాలలో మండల అధ్యక్షుడు షేక్ యాసిన్ మరియు మండల కార్యవర్గ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి రైతాంగానికి జరిగిన పంట నష్టం గురించి తెలుసుకోవడం జరిగింది. అనంతరం రైతాంగ సమస్యల మీద మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ కి తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగ సమస్యలతో కూడిన పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సమన్వయ బాద్యులు మనుబోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సీజన్లో పంటలు పండించడానికి నీటి ఎద్దడి ఏర్పడినప్పటికీ ఆరుగాలం శ్రమించిన రైతులు బోర్లు ద్వారా చాలా వ్యయ ప్రయాసలకోర్చి పంటలు రక్షించుకున్నారని తీరా పంట చేతికొచ్చిన సమయానికి తుఫాన్ విపత్తురూపంలో వచ్చి రైతాంగానికి కన్నీరు మిగిల్చిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తక్షణమే వైసీపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని తుఫాను వల్ల తడిసిన ధాన్యాని కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కార్యవర్గ సభ్యులు నందమూరి వెంకటేశ్వరావు, అడప శీను, బిల్లనారాయణ, చింతలతేజ, చింతలపండు, తోట కృష్ణకిషోర్, సాలి నాగరాజు, పసుపులేటి సతీష్, తదితర జనసైనికులు పాల్గొన్నారు.