ప్రభుత్వమా మేలుకో.. అన్నదాతలను ఆదుకో: సయ్యద్ నాగుర్ వలి

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గ, నకరికల్లు మండలం కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ సమావేశంలో జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో కుదేలైన అన్నదాతలకు అండగా జనసేన పార్టీ శ్రేణులు ఉంటుంది. అకాలంగా కురుస్తున్న వర్షం అన్నదాతల నడ్డి విరుస్తుంటే.. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం రైతుల గొంతు కోస్తుంది.. ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరచి అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను తక్షణం ఆదుకోవాలి.. అంటూ.. నకరికల్లు మండలం లో రైతన్నలకు అండగా నిలబడి గళమెత్తి గర్జించిన జనసేన పార్టీ నకరికల్లు మండలం నాయకులు, జనసైనికులు, వీరమహిళలు.. గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు చేతికి అందిన పంట నీటి పాలు అయిందని సకాలంలో కొనుగోలు చేయని ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రధానంగా తాము ఈ దుస్థితి ఎదుర్కొంటున్నామని.. నూర్చిన పంట తడిసిపోతే కోసిన పంట కుళ్ళిపోయిందని పలువురు రైతులు వాపోయారు. వాస్తవ పరిస్థితి చాలా దారుణంగా ఉండడంతో చలించిపోయిన జనసేన నాయకులు ప్రభుత్వం రైతులకు యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారం ఇవ్వాలని, తడిసిన పంటను కూడా స్టీమ్ బియ్యం తయారీ మిల్లులకు తక్షణం తరలించాలని. డిమాండ్ చేస్తూ నినాదాలు ఇచ్చారు. జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి
సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ బత్తిని శ్రీనివాసరావు, నకరికల్లు మండలం జాయింట్ సెక్రటరీ ఏపూరి హరీష్, జాయింట్ సెక్రెటరీ దూదేకుల సైద్ మస్తాన్, షేక్ ఖాలేషా, ఉదరపు రాజు, ఏపూరి రంగా, నక్క వెంకటేశ్వర్లు, శీను, మస్తాన్, సైదులు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.