ఘనంగా యూఏఈ జనసేన సంక్రాంతి సంబరాలు

యూఏఈ, మకర సంక్రాంతి సందర్భంగా యూఏఈ జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అద్భుతమైన రీతిలో జరిగాయి. ఈ సంబరాలకి ముఖ్యఅతిథిగా పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమానికి యూఏఈలో ఉన్న వ్యాపారవేత్తలైన పాపోలు వీరాస్వామి, కరణం అనిల్ బాబు అధ్యక్షత వహించారు. యూఏఈ జనసేన జనసేన కోర్ కమిటీ సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. పిల్లల ఆట పాటలతో కనులు విందుగా ఆహ్లాదమైన పండుగ వాతావరణం కనబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యూఏఈ జనసేన ఒక ప్రత్యేకమైన లోగో మరియు టీ షర్టు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొటికలపూడి గోవిందరావు చేత ఆవిష్కరించడం జరిగింది. యూఏఈ జనసేన కోర్ కమిటీ సభ్యులు, టీం సైనిక ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటాలపై ఒక ప్రత్యేకమైన క్యాలెండర్ రూపొందించి దాదాపుగా 25 వేల కాపీలు ఆంధ్రరాష్ట్రం అంతట పంచి జనసేన యొక్క సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు అర్థమయ్యేలాగా చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది. యూఏఈ కోర్ కమిటీ సభ్యులందరూ వారి చక్కటి ఉపన్యాసాలు, వారికి జనసేన నుండి ఎటువంటి సహాయం కావాలో, వారు ఏవిధంగా జనసేనకు సహాయపడతారో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొటికలపూడి గోవిందరావుకి తెలియజేశారు. యూఏఈ జనసేన ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ మేనేజ్మెంట్ తో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారో అన్ని వివరించారు. దీనికి పార్టీ నుండి సహాయం అందించాల్సిందిగా ముఖ్యఅతిథిని కోరడం జరిగింది. దానికి ముఖ్యఅతిథిగారైన కోటికలపాటి గోవిందరావు సానుకూలంగా స్పందించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం కలిగించిందని, సంక్రాంతి పండుగ సంబరాలు యూఏఈ జనసైనికులతో చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు. ఎంతో సమయం వెచ్చించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కోర్ కమిటీ సభ్యులు అందరినీ అభినందించారు. యూఏఈ జనసేన కోర్ కమిటీ సభ్యులు నా సేనకోసం నా వంతు కోసం ఏడు లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన విషయం కొటికలపూడి గోవిందరావు చెప్పారు. యూఏఈ జనసేన గురించి పార్టీ శ్రేణుల్లో మాట్లాడుతానని మాట ఇచ్చారు. ఈ సభా సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన పాపోలు వీరాస్వామి, కరణం అనిల్ బాబులు ఇకపై యూఏఈ జనసేన చేసే ప్రతి కార్యక్రమాన్ని తమ రెండు కంపెనీలు కలిసి చేస్తాయని తెలియజేయడం చాలా సంతోషం కలిగించింది. ఈ సందర్భంగా యూఏఈ జనసేన ఈ కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, పోరాటాల కోసం క్యాలెండర్లు తయారు చేయడంలో ఎంతగానో సహకరించిన విజయవాడ జనసేన లీడర్ శ్రీమతి నందిని చౌదరి, తెలంగాణ వీర మహిళ విభాగం వైస్ చైర్ పర్సన్ శ్రీమతి రత్న పిల్లా, టీం సైనిక ఫౌండర్ అమీర్ ఖాన్ మరియు వారి సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు. మళ్ళీ మార్చి 14 జనసేన ఫార్మేషన్ డే కి పెద్ద కార్యక్రమం చేయడానికి యూఏఈ జనసేన నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమంలో యూఏఈ జనసేన కోర్ కమిటీ సభ్యులు పాపోలు అప్పారావు, అప్పాజీ, శ్రీహరి, చంద్రశేఖర్, సత్య రావి, రవికుమార్, శ్రీనివాస రావు, ముని కుమార్, రవివర్మ, సత్య మాలే, వేణు, నాగ, బాలాజీ, నాగభూషణం పాల్గొన్నారు.