లక్కవరపు కోటలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

శృంగవరపుకోట నియోజకవర్గం, లక్కవరపు కోట మండలంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ముందుగా కేకు కటింగ్ చేసి అనంతరం తసుబెళ్లి నేషనల్ ఫౌండేషన్ బ్లడ్ బ్యాంక్ వాలకీ మెగా రక్తదాన శిబిరం ద్వారా జనసైనికులు రక్తదానం చేయడం జరిగింది. 40 మంది జనసైనికులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం మండల నాయకులు రమెళ్ళ శివాజి, రావాడ నాయుడు, అలమండ రాంబాబు, ఎస్ కె ఫిరోజ్, రావాడ రెహ్మాన్ ఇర్ర వెంకట లక్ష్మి, సగుబిండి వెంకట లక్ష్మి అధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వబ్బిన సత్య నారాయణ హాజరవడం జరిగింది.