పితాని ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర పిఏసి సభ్యులు ముమ్మిడివరం జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మెగా అభిమానులు, జనసైనికులు ఆధ్వర్యంలో పితాని బాలకృష్ణ కేక్ కట్ చేసి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. అయన ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఈరాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలలో భాగంగా ముమ్మిడివరం ఆసుపత్రులలోని రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణిచేశారు. అనంతరం అలాగేముమ్మిడివరం నియోజకవర్గంలోని పలుగ్రామల్లో జనసైనికులు ఏర్పాటు చేసిన కేకులను కటింగ్ చేసి అధినేత పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాక్షలు తెలియజేసారు. అనంతరం జనసైనికులు ముమ్మిడివరం పురవీధులలో బైక్ ర్యాలీ నిర్వహించి తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. తాళ్ళరేవు మండలం పి.మల్లవరం గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసారు. ఈ కార్యక్రమంలో గుద్దటి జమి, గోదశి పుండరీష్, సానబోయిన మల్లికార్జునరావు, అత్తిలి బాబురావు, డా.ఆర్.ఎన్.బి ప్రసాద్, యలమంచిలి బాలరాజు, సానబోయిన వీరభద్రావు, ఎంపీటీసీ జమి, గోలకిటి వెంక్కన్నబాబు, రాంబాల రమేష్జ, మోకా బలప్రసాద్, కాయల బలరాం, చవటపల్లి సి ఎం, జక్కంశెట్టి పండు, గిడ్డి రత్నశ్రీ, జగతా సత్య, నూకల దుర్గ, ఓగూరి భాగ్యశ్రీ, మచ్చా నాగబాబు, కడలి వెంకటేశ్వరావు, విత్తనాల అర్జున్, మద్దింశెట్టి పురుషోత్తం, కర్రా ప్రసాద్, సలాది రాజా, బొంతు వీరబాబు, మారెళ్ల రాజేష్, దూడల స్వామి, నాని, రవితేజ, వంగ సీతారాం, అడపా సాయి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.