యూఏఈ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

దుబాయి, నూతన సంవత్సరం సందర్భంగా దుబాయిలో యూఏఈ జనసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరిగింది. యూఏఈలో ఉన్న అనేక మంది జనసైనికులు తమ కుటుంబ సభ్యులతో అంతా కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూఏఈ జనసేన తరపున పాపోలు వీరాస్వామి, పాపోలు అప్పారావు, మొయిదా అప్పాజీ, అడ్డాల బాలాజీ, అనిల్ కరణం, నగేష్ పూసర్ల అనేకమంది జనసైనికులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. జనసైనికులు అందరూ ఆటపాటలతో 2022 కి వీడ్కోలు పలుకుతూ 2023 కి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మాట్లాడుతూ 2024 ఎలక్షన్ లక్ష్యంగా పెట్టుకొని ప్రతి జనసైనికుడు పార్టీ కోసం పాటుపడి మన ప్రియతమ నాయకుడు, నిస్వార్థ ప్రజా సేవకుడు అయిన పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లే లాగా నిస్వార్ధంగా పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. జనసేన అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ కు మనుగడ ఉంటుందని ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడారు. అతి త్వరలో యూఏఈ జనసేన ఆంధ్రప్రదేశ్ మొత్తం జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ సమస్యలపై చేస్తున్న పోరాటాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటాల గురించి వివరించే 25,000 క్యాలెండర్లు విడుదల చేస్తున్నారు. పవన్ రావాలి పాలన మారాలి అన్న స్లోగన్ తో యూఏఈ లో ఉన్న జనసైనికులు అందరూ కలిసిగా పోరాటం చేయడానికి ప్రతిజ్ఞ చేశారు. తదనంతరం 2023 నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేసి జనసైనికులు అందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి జనసైనికుడికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.