నూతన సంవత్సర సందర్భంగా గొటివాడ అగ్రహారం గ్రామానికి వాలీబాల్ కిట్

మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలంలో గొటివాడ అగ్రహారం గ్రామానికి జనసేన పార్టీ మాడుగుల నియోజకవర్గ నాయకులు రాయపురెడ్డి కృష్ణ సొంత నిధులతో అంజి, మాతాజీ మరియు సురేష్ చేతుల మీదుగా గొటివాడ గ్రామ జనసైనికులకు ఒక వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర సందర్భంగా జనసేన పార్టీలో కొత్త కొత్త మార్పులు వస్తాయని అతి త్వరలోనే పార్టీ మరింత పుంజుకునే కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొటివాడ అగ్రహారం గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.