సత్తెనపల్లి జనసేన కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

  • భారత దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించడం కోసం ఎందరో మహానుభావులు ఆత్మబలి దానాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు, అలాంటి ఎంతోమంది మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వతంత్రం..
  • భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలైన పర్వదినం సందర్భంగా జనసేన పార్టీ తరపున సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు…

సత్తెనపల్లి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో భరతమాత చిత్రపటానికి పూలమాల అలంకరించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, సత్తనపల్లి రూరల్ మండలం అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, వల్లెం శ్రీనివాసరావు, సిరిగిరి మణికంఠ, బత్తుల కేశవ, తిరుమల శెట్టి సాంబ, సులం రాజ్యలక్ష్మి, అమర్ గుత్తి నాగరాజు, గర్నపూడి చిన్ని, చల్ల గరుడ, ఐలం ఆదినారాయణ, సోమిశెట్టి మణిరత్నం, మాదంశెట్టి మహేష్, చౌదరి అనిల్, చౌదరి సాయి, అంబటి వెంకటేష్, చౌదరి వెంకటేష్, నీలం శ్రీను, పగడాల పాల్గొన్నారు.