అంబేద్కర్ కు ఘనమైన నివాళులు!: మాదాల శ్రీరాములు

*బడుగులకు ప్రాణం! అన్ని వర్గాల వారికి ఆదర్శం!
*దేశానికి రక్షణ కవచం అందించిన రాజ్యాంగ నిర్మాత!
*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతికి ఘనమైన నివాళులు!

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకునియోజకవర్గ జనసేన పార్టీ, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు మాట్లాడుతూ.. డాక్టర్ భి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి ఘన మైన నివాళులు అర్పిస్తున్నామని తెలియజేశారు. ప్రపంచ దేశాలలో భారత రాజ్యాంగము చాలా శక్తివంతమైనదని, భారత దేశంలో ప్రజాస్వామ్యం గొప్పగా ఉన్నదని ప్రపంచ వ్యాప్తంగా నిరూపించిన గొప్ప మేధావి, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. నేడు బడుగు బలహీన వర్గాలలో అందరికీ సమానత్వం, స్వేచ్ఛ కల్పించారని, కుల నిర్మూలన, అంటరానితనాన్ని పారద్రోలిన, గొప్ప దేశోద్ధారకుడు, పేద ప్రజల పట్ల, దళితులు బడుగు బలహీన వర్గాల పట్ల, అణగారిన పీడిత బాదిత వర్గాల పట్ల, ఒక శక్తిగా అవతరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి మహామేధావికి వందనాలు సమర్పిస్తున్నామని ఈ సందర్భంగా అరకు నియోజకవర్గం జనసేన పార్టీ అరకు పార్లమెంట్ అదికార ప్రతి నిధి మాదాల శ్రీరాములు తెలియజేశారు.