యండపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో యు కొత్తపల్లి మండలం యండపల్లి గ్రామంలో డా.బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరియు సమసమాజాన్ని నిర్మించడానికి జీవితకాలం కష్టపడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి జిల్లా సంయుక్త కార్యదర్శి చీకట్ల శ్యామ్ కుమార్, యు. కొత్తపల్లి మండల ప్రెసిడెంట్ పట్టా శివ వారి ఆధ్వర్యంలో యు కొత్తపల్లి మండలం యండపల్లి గ్రామంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసిని నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు ఎంపీటీసీ అభ్యర్థి స్వామి రెడ్డి సుబ్రమణ్యం, దొడ్డి దుర్గాప్రసాద్, స్వామిరెడ్డి అంజి, సురాడా శ్రీను, వంకా కొండబాబు, శివారెడ్డి, పంతాడా ప్రసాద్, ముమ్మసాని సురేంద్ర, ఇజ్రాయిల్, మైలపల్లి రాజు, సురాడా ప్రతాప్, జనసైనికులు నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ అభిమాన సంఘం ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు.