ఘనంగా జనసైనికుని జన్మదిన వేడుకలు..

రాయవరం: రాయవరం మండలం, చెల్లూరు గ్రామ జనసైనికుడు కీ.శే. బండి రాంబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వేగుళ్ళ లీలాకృష్ణ తనయుడు యూత్ ఐకాన్ వేగుళ్ళ వీరాజ్ (రాజా బాబు) విచ్చేసి చెల్లూరు గ్రామ జనసైనికుల అధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ నీ పంచారు. అనంతరం ఎంపీటీసీ -1 శ్రీమతి గొల్లపల్లి అనురాధ వెంకట రమణ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు, పంచాయితీ 1వ వార్డ్ సభ్యులు గళ్ళా సావిత్రి, గరగ ధనలక్ష్మి, వల్లూరి సత్య ప్రసాద్, తలాటం వెంకటేష్, కొండేపూడి ఆనంద్, సుంకర సంతోష్, కొండేపూడి అవినాష్, బండి వీరబాబు, నరేష్, మణికంఠ, పిల్లా రాజేష్, వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.