మకా షాలినికి ఘన సన్మానం

గాజువాక నియోజకవర్గం: జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గం 68 వార్డ్ కి నూతనంగా ఎన్నికయిన మకా షాలినికి 68వ వార్డ్ అప్పన్న కాలనీ జనసేన & తెలుగుదేశం నాయకులు జనసైనికులు వీరమహిళలు శుభాకాంక్షలు తెలియచేసి సన్మానిచడం జరిగింది. తధానంతరం మాక షాలిని ఆధ్వర్యంలో అప్పన్న కాలనీ రామాలయ వద్ద నూతన ఓటు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి నూతన ఓట్లు నమోదు చేసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిప్పల రమణారెడ్డి, టీడీపీ 68వ వార్డ్ ఇంచార్జ్ గండికోట తాతరావు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, జనసైనికులు గుర్రాల చిన్నారావు, అప్పారావు, పిండి అశోక్, నక్క ఆదిలక్ష్మి నక్క వెంకటేష్, మారడబుడి నాగరాజు, కన్నా భార్గవరాజు తదితరులు పాల్గొన్నారు.