గల్ఫ్ సేన – జనసేన యూఏఈ ఆర్ధిక సాయాన్ని మనోజ్ కు అందించిన కందుల దుర్గేష్

రాజోలు, గత సంవత్సరం సీతారాంపురంలో యాక్సిడెంట్‌కు గురై ప్రాణాలు పొగోట్టుకున్న కర్రి ఏసు కుమారుడు తండ్రితో పాటు యాక్సిడెంట్‌కు గురైన కర్రి మనోజ్ కు కాళ్ళు విరిగిపోవడంతో గతసంవత్సరం కాళ్ళకు ఆపరేషన్ చేసి స్టీల్ రాడ్లు వేసారు. అవి తొలగించడానికి వాళ్ళకు ఆర్దిక స్థోమత లేక బాధలు పడుతూ జనసేన పార్టీ నాయకులను ఆశ్రాయించారు. వాళ్ళు మత్యకార కుటుంబానికి చెందిన వాళ్ళు. జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ రాజోలు నియోజకవర్గంలో మత్స్యకార అభ్యున్నతి పర్యటన నిమిత్తం వస్తున్న సందర్భంలో ఈ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చెస్తే బాగుంటుందని కోరగా.. గల్ఫ్ సేన – జనసేన యూఏఈ వారు స్పందించి 10 వేల రూపాయలు ఆర్ధిక సాయం చేయడం జరిగింది. వచ్చిన మొత్తాన్ని జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతుల మీదుగ శుక్రవారం కర్రి మనోజ్ కు అందజేయడం జరిగింది.