అంతర్రాష్ట్ర సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..

కొవిడ్-19, లాక్ డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు ఆగిపోయిన విషయం విదితమే. అంతర్రాష్ట్ర సర్వీసులు ఆగిపోవడంతో ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలా కాలం నుంచి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నా ఆ చర్చలు సఫలం కాకపోవడంతో సర్వీసులు అంతకంతకూ ఆలస్యమవుతూ వస్తున్నాయి.

అయితే తాజాగా ఈ చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం అందుతోంది. తెలంగాణ ఆర్టీసీ ఏపీ ఆర్టీసీ సర్వీసులు తమ రాష్ట్రంలో 1.61 లక్షల కిలోమీటర్ల మేర మాత్రమే నడపాలని కోరగా ఏపీ అధికారులు అందుకు ప్రాథమికంగా అంగీకరించారు. ఫలితంగా రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీకి 1.04 లక్షల కిలోమీటర్ల మేర సర్వీసులు తగ్గే అవకాశం ఉంటుంది. మరోసారి చర్చలు జరిపిన తరువాత అధికారికంగా ఈ మేరకు ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

గతంలో ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ పరిధిలో 2.65 లక్షల కిలోమీటర్ల సర్వీసులను నడిపేది. సర్వీసుల పునరుద్ధరణ సమయంలో తెలంగాణ సర్కార్ షరతులు విధించింది. రెండు మూడు రోజుల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని దసరా పండుగ నాటికి సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. 2.08 లక్షల కి.మీ. నడిపే ప్రతిపాదనను ఏపీ ఆర్టీసీ అధికారులు తెలంగాణ సర్కార్ ముందు పెట్టగా తెలంగాణ అధికారులు అందుకు అంగీకరించలేదు.

విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో అధిక సంఖ్యలో సర్వీసులను నడపాలని ఇరు రాష్ట్రాల అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఏయే మార్గాల్లో ఎన్ని సర్వీసులను నడపాలనే తుది జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సొమవారం మరోమారు ఏపీ ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ కు వెళ్లి అధికారులతో సమావేశమై కీలక ప్రకటన చేసే అవకాశాలు