పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై జనసైనికులకు దిశానిర్దేశం

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం పెదబయలు మండలంలో కిముడు పల్లి పంచాయితీ పులిగొంది, సేందుపుట్టు గ్రామాలను సందర్శించి జనసేనపార్టీ సిద్ధాంతాలు, పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై జనసైనికులకు దిశానిర్దేశం చేస్తూ ప్రజలకు వాస్తవ రాజకీయ పరిణామాలపై చైతన్యం కలిపిస్తున్న పెదబయలు జనసేనపార్టీ మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ ఈ పర్యటనలో ముఖ్యంగా పులిగొంది, సేందుపుట్టులో గల ప్రధాన సమస్యలు ప్రజ రవాణారోడ్డు సమస్య, తాగునీటి సమస్య, సెల్యూలార్ సిగ్నల్ టవర్స్ నిర్మాణ ఆవశ్యకత వంటి పలు అంశాలను ప్రజలతో సమావేశపరిచి తెలుసుకున్నారు. అలాగే రాష్టంలో ప్రస్తుత ప్రభుత్వతీరు గిరిజనులకు గడ్డుకాలమని అభివృద్ధి అంతంతమాత్రమే జరిగే మనలాంటి ఆదివాసీ ప్రాంతాలకు వెచ్చించే ఎస్టి సబ్ ప్లాన్ నిధులు, పంచాయితిరాజ్ శాఖ నిధులు పక్కదోవ మళ్లించి గిరిజనులకు ద్రోహచేస్తున్నారని ఈ విషయం గిరిజనప్రజలు తెలుసుకోవాలని తెలిపారు మార్పుకొరకు, భవిష్యత్ తరాల కొరకు జనసేనపార్టీ కి ఒక అవకాశం ఇవ్వాలని కుల, మత, ప్రాంత, బేధాలు లేని రాజకీయవ్యవస్థ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన పాలన కావాలంటే జనసేనపార్టీని అధికారంలోకి తేవాల్సిన బాధ్యత మన అందరిదని ప్రజలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జాగరపు పవన్ కుమార్(మండల అధ్యక్షులు పెదబయలు) మరియు జనసైనికులు పాల్గొన్నారు.