గిన్నిస్ రికార్డు సాధించిన అయోధ్య దీపోత్సవం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యనగరం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది. దీపావళి పండుగ రోజు సరయు నది ఒడ్డున లక్షలాది దీపాల కాంతులతో అయోధ్య నగరం వెలిగిపోయింది. నదీ తీరాన ఒకే సారి 6 కోట్ల 60 లక్షల 65 వేల569 దీపాల వెలుగులతో అయోధ్య మెరిసిపోయింది. ఆ శోభను చూసిన ప్రజలు మురిసిపోయారు.. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నేతృత్వంలో తలపెట్టిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు బుక్ లో స్థానం లభించింది.  గిన్నిస్‌ బుక్‌ సభ్యులు ఉత్తరప్రదేశ్‌ పర్యాటక రంగానికి, రామ్‌ మనోహర్‌ లోహియా అవధ్‌ విశ్వవిద్యాలయానికి అభినందనలు తెలిపారు.. అయోధ్యలో దీపావళి సందర్భంగా జరిగిన దీపోత్సవాన్ని అతి పెద్ద దీపోత్సవంగా గుర్తిస్తున్నట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలిపారు.