బైకాధి దాకయ్యకు బాసటగా యూఏఈ లోని గల్ఫ్ సేన – జన సేన టీమ్

దుబాయ్ లో ఉంటూ… ప్రమాద రీత్యా కళ్ళు కనబడక దానికి తోడు కోవిడ్ వచ్చి ఇబ్బంది పడుతున్న తెలంగాణకు చెందిన బైకాధి దాకయ్యకు యూఏఈ లోని గల్ఫ్ సేన – జన సేన టీమ్ కోవిడ్ టెస్ట్ చేయించి, ఫ్లైట్ టికెట్ తో పాటు 8 వేల రూపాయిల ఆర్థిక సహాయం చేసి హైదరాబాద్ కు పంపడం జరిగింది. ఎక్కడ ఉన్నా జనసేన అభిమానులు, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవా దృక్పథంను నిరూపిస్తునే ఉంటారు. ఈ సందర్భంగా దాకయ్య మాట్లాడుతూ ఆపదలో ఉన్న తనను మానవతా దృక్పథంతో ఆదుకున్న గల్ఫ్ జనసేన సభ్యులకు, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్య వాదములు తెలియచేసారు.