కువైట్ లో జనసైనికుని వ్యాపారానికి శుభాకాంక్షలు తెలిపిన గల్ఫ్ సేన జనసేన

కువైట్ లో అనేక సంవత్సరాల నుండి వ్యాపారం చేసుకుంటూ ఎంతోమందికి జీవనాధారం కల్పిస్తున్న జనసేన నాయకులు ఉమ్మడిశెట్టి హర్ష రాయల్ కొత్తగా దాన్వి ఫాషన్ అనే పేరుతో మొబైల్స్ మరియు లేడీస్ ఫ్యాన్సీ, ఎలక్ట్రానిక్స్ షాప్ ని స్థాపించారు. షాప్ ప్రారంభోత్సవ శుభసందర్భముగా జనసేన ఎన్నారై సేవా సమితి, గల్ఫ్ సేన జనసేన సభ్యులు కంచన శ్రీకాంత్ మరియు మిత్రబృందం హాజరై శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా కంచన శ్రీకాంత్ మాట్లాడుతూ కువైట్ మాలియాలో కె.ఫ్.సి ఎదురుగా రబియా బిల్డింగ్ లో షాప్ నెంబర్ 24లో స్థాపించిన దాన్వి ఫ్యాషన్ లో అన్నిరకాల మొబైల్స్, ఎలక్ట్రానిక్, లేడీస్ ఫ్యాన్సీ, గ్యారంటీ జూవెలరీ ఐటమ్స్ మొదలుగునవి సరసమైన ధరలకు లభించే విధంగా ఈ షాప్ ని స్థాపించడం సంతోషమని, ఇలాగే దిన దినాభివృద్ధితో వ్యాపారం బాగా జరగాలని, అందరూ కూడా హర్షని ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కంచన శ్రీకాంత్ తో కలసి, కోలా మురళి, జగిలి ఓబులేసు, అల్లం ప్రేమ్ రాయల్, కుంచ నగేష్, కొమ్మినేని బాలాజీ, పసుపులేటి రాజేష్, చందు రాయల్, ప్రకాష్, ఆనంద్, జోగినేని నాగేంద్ర, రాగిపాటి మణి తదితరులు పాల్గొన్నారు.