యువత బాధ్యతగా ఉంటే ఊరు అభివృద్ధి అవుతుంది: అబ్దుల్ అబు

పుట్టపర్తి మండల పరిధిలోని యువకులు మరియు నిరుద్యోగులు తమ సమస్యల గురించి అలాగే మండలంలోని పలు కార్యక్రమాల గురించి జనసేన పార్టీ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అబు తో చర్చించడం జరిగింది. అబ్ధుల్ మాట్లాడుతూ యువత బాధ్యతగ ఉంటె
తమ ఊర్లను అభివృద్ధి చేసుకోవచ్చని… యువతకు అన్నివిధాల జనసేన పార్టీ అండగ ఉంటుందని, వలసలను అరికట్టే విధంగ ప్రణాలికను సిద్ధం చేస్తోందన్నారు. వలస వెళ్లిన యువత తమ సొంత ఊర్ల మీద దృష్టిసారించినప్పుడే ఊరు అభివృద్ధి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నాయకులు డా. తిరుపతేంద్ర , బోయ వంశీ, మేకల పవన్, సాయి ప్రభు తదితరులు పాల్గొన్నారు.