Abu Dhabi: “జనంలోకి గల్ఫ్ సేన జన సేన” గల్ఫ్ జన సైనికుల ఆత్మీయ కలయిక

“జనం లోకి గల్ఫ్ సేన జన సేన” గల్ఫ్ జన సైనికుల ఆత్మీయ కలయిక కార్యక్రమం ద్వారా గల్ఫ్ దేశాలలో ఉన్న జన సేన సాను భూతి పరులను కలసి, వారి కష్ట సుఖాలు తెలుసుకొని, వారిని ఉత్తేజ పరిచి, వారి ద్వారా స్వదేశం లోని వారి కుటుంబ సభ్యులను, బందు మిత్రులను జన సేన పార్టీ వైపు ఆకర్షితులను చెయ్యడం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం
లో బాగంగా, శుక్రవారం అబుదాభి లోని గల్ఫ్ సేన జన సేన నాయకులు జన సైనికులను కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ సేన జన సేన నాయకులు, నారాయణ కెడివిఎస్ కో-ఆర్డినేటర్, సత్య, మునికుమార్, హరి, నాని అడ్డాల, బాలాజి, స్వామి, కిరణ్ మరియు ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు.