Vijayanagaram: జనసేన నాయకుల అక్రమ అరెస్ట్

లచ్చయ్య పేట షుగర్ ఫ్యాక్టరీ బాధితులకు అండగా నిలబడేందుకు వెళుతున్న జిల్లా వ్యాప్తంగా అక్కడకు వెళుతున్న జనసేన నాయకులను, కార్యకర్తలను, పోలీసులు హౌస్ అరెస్ట్, అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కలెక్టర్ ఆఫీస్ వద్ద శాంతి యుత నిరసన తెలిపి అనంతరం కలెక్టర్ గారికి వినతిపత్రం ఇద్దామని వెళ్లిన విజయనగరం జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), చెల్లూరి ముత్యాల నాయుడు, లోపింటి కళ్యాణ్, దాసరి యోగేష్ లను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వన్ టౌన్ లో నిర్బంధించారు. శాంతియుత నిరసన తెలియచేసే హక్కులను పోలీసులు భగ్నం చేయడం దారుణమని అన్నారు.