Amalapuram: నిరుపేదలకు అండగా నిలబడుతున్న ‘గల్ఫ్ సేన – జన సేన’

తూర్పుగోదావరిజిల్లా అమలాపురం కష్టాల కడలిలో ఉన్న అభాగ్యులకు దేవుడిచ్చిన వరంలా మారారు.. గల్ఫ్ NRI జనసేన కో ఆర్డినేటర్ పెనుమల జాన్ బాబు. గల్ఫ్ జనసేన నేతృత్వంలో పెనుమల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పటికే తూర్పుగోదావరిజిల్లా అమలాపురం నియోజకవర్గ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు జాన్ బాబు. తాజాగా మన నేల – మన బాధ్యత పేరిట కార్యక్రమం తలపెట్టి రాజకీయాలకు అతీతంగా సామన్యుల క్షేమంకోరి ప్రజా సేవలో ముందుకు నడుస్తున్నారు ఆయన.

పదవులుకన్నా పేదవాడి సంక్షేమం మిన్న అన్న నినాదంతో జాన్ బాబు ‘గల్ఫ్ సేన – జన సేన’ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలంలోని ఈదరపల్లి గ్రామంలో ఇటీవల చనిపోయిన నక్కా సునీల్ బాబు కుటుంబానికి 30వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని గల్ఫ్ లోని అబుదాబి నుంచి జాన్ బాబు, మొగళ్ళ చంద్రశేఖర్ మిత్రబృంద సభ్యులు పంపించారు. ఈ మొత్తాన్ని అమలాపురం రూరల్ మండల జనసేన ఇంచార్జి లింగోలు పండు, కార్యదర్శి పరమట చిట్టిబాబు, మునిసిపల్ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను, రాష్ట్ర జనసేన వైద్య విభాగ కార్యదర్శి నాగమానస, ఎంపీటీసీలు పనసా బుజ్జి, నాయకులు డి.యెస్.ఎన్. కుమార్, రాష్ట్ర జనసేన చేనేత విభాగం కార్యదర్శి బట్టు పండు తదితర జనసైన్యం అంతా కలసి సోమవారం బాధిత కుటుంబానికి అందజేశారు.

అమలాపురంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి ఎన్నారై నాయకులకు సమాచారం అందించిన వెంటనే స్పందించి వారి కష్ట నష్టాలను తెలుసుకుని, ఎక్కడో దేశం కాని దేశంలో వృత్తి రీత్యా ఉంటున్న గల్ఫ్ జనసైనికులు.. జనసేనాని సిద్దాంతాలు ముందుకు తీసుకెళ్లేందుకు రావడమే కాకుండా ఇలా అభాగ్యులకు సాయం అందించడం కోసం గల్ఫ్ దేశాలు అయిన పుజారా, అబుదాబి దేశాలకు చెందిన జనసైన్యం తోడుగా నిలబడటం పట్ల అమలాపురం మండల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.