Anatapur: జనసేన పార్టీ విద్యార్ధులకు ఎపుడూ అండగా ఉంటుంది – పత్తి చంద్రశేఖర్

అనంతపురం పట్టణంలో సత్యసాయి ఎయిడెడ్ స్కూల్ మరియు కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు యజమాన్యంను నిలదీయడం జరిగింది. అందుకు యజమాన్యం పోలీసు వారితో విద్యార్థులపై తీవ్రంగా దాడి చేయించి గాయపరచడం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను జనసేనపార్టీ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ పరామర్శించి… విద్యార్థులు దేశానికి వెన్నెముకలాంటి వారు వారికి జనసేనపార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మనోధైర్యాన్ని ఇచ్చారు.